Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన మజ్లిస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్

జహీరాబాద్ ఆగష్టు 28 (జనంసాక్షి )ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్  అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్ అసద్ ఉద్దీన్ ఒవైసీ  కార్వాన్ శాసనసభ్యులు, సంగారిడి జిల్లా ఇంచార్జ్  కౌసర్ మొహియెుద్దీన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్ రూ. 37500 ముఖ్యమంత్రి సహాయ నిధిని మజ్లీస్ పార్టీ కార్యాలయంలో  లబ్దిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మజ్లిస్ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్ మాట్లాడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందజేస్తున్నామని, పేదలకు వైద్యం చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు  ఈ కుటుంబానికి సహాయ నిధి అందించడానికి కృషి చేసిన  కౌసర్ మొహియెుద్దీన్ గారికి  కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ అజ్మత్ పాషా సంయుక్త కార్యదర్శి మెుహిఉద్దీన్ గౌరి శాంతినగర్ వార్డ్ అధ్యక్షులు సయ్యద్ రాషెద్, ముహమ్మద్ అయూబ్ నాయకులు ముహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు.