హైదరాబాద్: ప్రముఖ సినీ నటి ఆర్తీ అగర్వాల్ అంత్యక్రియలు నేడు పూర్తయ్యాయి. ఆర్తీ చేయించుకున్న లైపోసక్షన్ ఆపరేషన్ వికటించడంతో గత శనివారం మృతిచెందిన విషయం తెలిసిందే. అమెరికాలోని అట్లాంటాలో కుటుంబసభ్యులు, సన్ని హితులు ఆర్తీకి బాధతప్త హృదయాలతో తుదివీడ్కోలు పలికారు.




