జనంసాక్షి, హైదరాబాద్ : పదో తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. మరో రెండు పరీక్షలను ఈ నె 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. 8న ఒ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 9న ఎస్.ఎస్.సి. వొకేషనల్ కోర్సు (థియర్) పరీక్షలు జరగనున్నాయి. మొత్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 574 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 29 మంది అధికారులు, సిబ్బందిని విద్యాశాఖ సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి వెల్లడించారు. 232 మంది ఇన్వజిలేటర్లు, 14 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఆరుగురు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు అటెండర్లను పరీక్ష విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ఈ నెల 12 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 24 కేంద్రాల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ నిర్వహించనున్నారు. మే 20 నుంచి 26 తేదీల మధ్య ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.




