Wednesday, 4 November 2026

ముగిసిన “టెన్త్” పరీక్షలు : విద్యార్థుల “జోష్”

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి పదో తరగతి పరీక్షలు మంగళవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయిమిర్యాలగూడ పట్టణంలో  పకడ్బందీ ఏర్పాట్ల నడుమ  ఈనెల 3 న ప్రారంభమైన పరీక్షలు  మంగళవారం ముగిసినాయి. మిర్యాలగూడ పట్టణంలోని 12 కేంద్రాలలో 2483 విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 24 75 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు విధితమే.పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఈలలు, కేకలతో జోష్ గా సందడి చేశారు. వార్షిక పరీక్షల కోసం గత కొన్ని నెలల నుంచి పట్టుదలతో చదివి పరీక్షలు రాయడం జరిగిందని నేటితో పరీక్షలు ముగియడంతో ఇక ఎంజాయ్ అని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు తమ స్నేహాన్ని ముందు ముందుకు తీసుకెళ్లేందుకు తమ సెల్ నెంబర్లు అడిగి తీసుకున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లో కొందరు బిర్యానీ రెస్టారెంట్లకు, మరికొందరు సినిమాలకు వెళ్తామని  పేర్కొన్నారు. టిఎస్ఆర్టిసి గ్రామీణ ప్రాంతాల, దూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరవుతున్న టెన్త్ విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఎలాంటి టికెట్ తీసుకోకుండా కేంద్రాల వద్ద వదిలిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షా ఫలితాలు మే రెండో వారం తరువాత ప్రకటించనున్నారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.