Tuesday, 3 November 2026

ముగిసిన దాశరథి అంత్యక్రియలు 

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీ శిఖరం దాశరథి రంగాచార్య అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ వెస్ట్ మారేడ్‌ పల్లిలోని శ్మశాన వాటికలో, అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాశరథిని కడసారి చూసేందుకు అభిమానులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా దాశరథి వారసత్వాన్ని కొనసాగిస్తామని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని నినదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *