హైదరాబాద్: చంద్రబాబు ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేయలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. స్టీఫెన్ సన్ ఫిర్యాదు మేరకు ఏసీబీ వాయిస్ రికార్డు చేసిందని చెప్పారు. తన పంచాయితీని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చేందుకు చూస్తున్నారని విమర్శించారు. ఇంతకీ.. ఆడియో టేపులో ఉన్న సంభాషణ తనదేనా..? కాదా..? అని బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.




