Wednesday, 4 November 2026

ముగిసిన ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు

 

జనం సాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 18:
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలును పురస్కరించుకొని మండల కేంద్రంలో ఫ్రీడం కప్ ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి టాస్ వేసి అటను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహధపడతాయి అన్నారు. క్రీడలను మొదటగా ఎంపీపీ డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేశారు.మొదటగా మండల ప్రజా ప్రతినిధులు / మండల పొలిటిషియన్స్ ఆడగా పొలిటిషియన్స్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్ లో మండల అధికారులు / పత్రిక మిత్రుల మధ్య జరిగిన మ్యాచ్ లో మండల అధికారులు విజయం సాధించారు. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో (మండల అధికారులు / మండల పొలిటిషియన్స్) మ్యాచ్ లో పొలిటిషియన్స్ జట్టు విజయం సాధించింది.కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి,తహసీల్దార్ సయ్యద్ ముబిన్ అహ్మద్,ఎంపిడిఓ నర్సయ్య, ఎస్సై, దాస సుధాకర్ వివిధ గ్రామాల సర్పంచ్ లు ,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.