Tuesday, 3 November 2026

ముగిసిన రామారావు అంత్యక్రియలు

  హైదరాబాద్‌ : సిక్కిం మాజీ గవర్నర్‌, భాజపా జాతీయ నేత రామారావు అంత్యక్రియలు రాయదుర్గం శ్మశాన వాటికలో సోమవారం అధికార లాంఛనాల మధ్య జరిగాయి. ఈ అంత్యక్రియలకు తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, భాజాపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు డా. కె.లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, భాజాపా జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *