హైదరాబాద్‌లో ఘనంగా స్వాగతం
వాస్తుకోసం కొత్త సచివాలయం వద్దని కెసిఆర్‌కు సూచన
హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వాస్తుపై గురి వుంటే ప్రస్తుతమున్న సచివాలయంలోనే మార్పులు చేర్పులు చేసుకుని ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.
లక్ష్మన్ పేర్కొన్నారు. విమోచన యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. వాస్తు పేరుతో కొత్తగా సచివాలయ నిర్మాణం చేపట్టి ప్రజాధనం వృధా చేయవద్దన్నారు. ప్రస్తుత సచివాలయం నుంచి ఎపి ప్రభుత్వం ఖాళీ చేసి వెల్లడం వల్ల అనేక భవంతులు ఖాళీగా ఉన్నాయని, ఇప్పుడన్నది చాలని, కొత్తది అవసరం లేదని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఈనెల 17వతేదీన నిజామాబాద్‌లో విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతారన్నారు. అలాగే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈనెల 11,12,13 తేదీల్లో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి జరగనుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఉపయోగించిన బురుజులు శిథిలమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని లక్ష్మణ్ అన్నారు. విమోచన దినోత్సవంపై కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని నాడు కేసీఆర్ డిమాండు చేసి మాటతప్పారన్నారు.రైతు సమితుల ఏర్పాటుపై జారీ చేసిన జీవో 39 అప్రజాస్వామికమని.. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో బీజేపీ మంత్రులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనేది మోదీ విధానం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎవరున్నా లేకున్నా రాష్టాల్ల్రో అభివృద్ది ఆగదన్నారు. భాజపా రాష్టాధ్యక్ష్రుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర గురువారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లాలోని అప్పంపల్లిలో ముగిసింది. గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం కూడా ఈదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్నారు. సెప్టెంబరు 17న కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో నిజామాబాద్‌లో పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తెలంగాణ స్వాతంత్య సమరయోధులకు పింఛన్లు అందజేస్తోందని, వారికోసం ప్రత్యేకంగా విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించదని నిలదీశారు.కాగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమోచన యాత్ర ముగించుకొని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్న లక్ష్మణ్‌కు ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం తెలిపారు.




