హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో వేద పాఠశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే… ఈ వేద పాఠశాల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో దేవాదాయశాఖ సర్వ శ్రేయోనిధి నుంచి 50 శాతం వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకుంది. కాగా… రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ కింద 20 సీట్లతో ఈ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంతో కాలంగా దీనికోసం డిమాండ్ చేస్తున్న పండితులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.




