హైదరాబాద్: టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఎసిబి విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు నుంచి వేం నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు విచారించారు. అనంతరం ఆయన బయటికి వచ్చారు. వేం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఎసిబి విచారణకు సహకరిస్తానని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. రాజకీయ కుట్రలో భాగంగా తనను ఇరికిస్తున్నారని వాపోయారు.




