Thursday, 5 November 2026

ముగ్గురు దొంగల అరెస్ట్‌

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ):  రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని విూర్‌పేట, ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ల పరిధిలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. విూర్‌పేటలో దొంగతనాలు చేస్తున్న ఆరాధన, ఉమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితుల నుంచి 17 తులాల బంగారంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 5.1 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌ పరిధిలో దొంగ అక్కన్న ప్రవీణ్‌రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుని నుంచి 10.5 తులాల బంగారం ఆభరణాలు, 300 గ్రాముల వెండి, రూ. 1,41,900ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌రెడ్డిపై 19 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.