Wednesday, 4 November 2026

ముదిరాజ్ రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు పిడిగం నాగయ్యకు ఘనంగా సన్మానం

తిరుమల (సాగర్) మార్చి 27, (జనంసాక్షి):
మండలంలోని రాజవరం గ్రామంలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పిడిగం నాగయ్య ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజవరం బస్టాండ్ లో ముదిరాజ్ జండా పిడిగం నాగయ్య ఆవిష్కరించాడు. అనంతరం రాజవరం మెయిన్ సెంటర్లో నాగయ్య ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘంలో మనకు మనకు మధ్య విభేదాలు ఉండొచ్చు గాని ఇతరులు సంఘంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని, ముదిరాజుల అభివృద్ధి కొరకు డాక్టర్ బండ ప్రకాష్ గారి నాయకత్వం లో మరియు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సహకారంతో నిరంతరం పని చేస్తామని తెలిపారు. ముదిరాజులు సబ్బండ వర్గాలను కలుపుకొని సామాజిక, ఆర్థిక రాజకీయ ,విద్య వైద్యముతో సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ సత్యనారాయణ, మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు చేన్నబోయిన నగేష్, సంఘం నాయకుడు చౌడబోయిన చిన్న వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు చౌడబోయిన వెంకటేశ్వర్లు, చేన్నబోయిన లక్ష్మయ్య, వార్డ్ మెంబర్ పెంటపోయిన వెంకటేశ్వర్లు ,లింగాల నాగేశ్వరావు, పోలేపల్లి చిన్న మైసయ్య ,చౌడబోయిన మల్లయ్య, మేకల ఎంకన్న, మేకల రాము ,మేకల ఈదయ్య, చౌడబోయిన మల్లయ్య, చేన్నబోయిన పెద్ద లక్ష్మయ్య ,రమేష్ సత్యం, మురళి తదితరులు పాల్గొన్నారు.