ముద్దుల బాబా అరెస్టు

మోరీగావ్‌ (అస్సాం),ఆగస్టు25(జ‌నం సాక్షి )ః ఆడవాళ్లకు శారీరక, మానసిక రోగాలు నయంచేస్తానని ఆ బాబా చెప్పుకునేవాడు. అందుకు చిట్కా ఏమిటంటే.. ఓ ముద్దు. అలాంటిలాంటి ముద్దు కాదు. మహత్తు కలిగిన ముద్దు అంటూ తమాషాలు చేస్తున్న బాబాను పోలీసులు అరెస్టు చేశారు. తనకు అతీంద్రియ శక్తులు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నుంచే వచ్చాయని చెప్పుకునేవాడు. అస్సాంలోని మోరిగావ్‌లో వెలిసిన ఈ ముద్దుల బాబా అసలు పేరు రాంప్రకాశ్‌ చౌహాన్‌. తన చమత్కారీ చుంబన్‌తో మహిళల సాంసారిక సమస్యలన్నిటినీ తీరుస్తానని చెప్పేవాడు. అమాయక గ్రావిూణ మహిళలను బకరాలను చేసేవాడు.తన ఇంట్లో ఓ గుడి ఏర్పాటు చేసుకుని అక్కడే భక్తురాళ్ల సమస్యలను పరిష్కరించేవాడట. అలాఅలా పేరు బాగానే పాకిపోయింది. మోరీగావ్‌ జిల్లా శతాబ్దాలుగా క్షుద్రపూజలకు పేరెన్నిక గన్నది. అందరూ విష్ణువు ఆశీస్సులతోనే శక్తులు సంపాదించామని చెప్పుకుంటారు. మన ముద్దుల బాబా చికిత్సా శక్తుల గురించి తని తల్లే ప్రచారం చేయడం విశేషం. బూడిద ఉప్ఫని ఊదడం, తాయెత్తులు కట్టడం లాంటివి అందరూ చేస్తారు. కానీ ఈ బాబా ముద్దులకు దిగడంతో సమస్యలు వచ్చాయి. వ్యవహారం తేడాగా ఉందే అనుకుని పోలీసులు గత బుధవారం అరెస్టుచేశారు. బాబా ప్రస్తుతం ఊచలు ముద్దు పెట్టుకుంటున్నాడు.

—————