– ప్రైవేట్ స్కూల్స్ సిండికేట్
– ఉగాది నుండి ఒక్క పూట బడి పెట్టేందుకు తీర్మానం చేసుకున్నట్లు సమాచారంమునగాల, మార్చి 15(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాలలో ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఒక్క పూట బడి నిర్వహిస్తున్నా.. కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమన్యాలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరీ పాఠశాలలను నడుపుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆ పాఠశాలలో పని చేసే టీచర్లను సెలవు దినాల్లో అడ్మిషన్ల కొరకు గ్రామాల్లో ఇంటింటికి తిప్పుతున్నారని సమాచారం. ఉగాది నుండి ఒక్క పూట బడి పెట్టేందుకు తీర్మానం చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ విషయంలో ప్రైవేట్ స్కూల్స్ సిండికేట్ అయినట్టు తెలుస్తోంది.




