Friday, 6 November 2026

మునుగోడులో ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్

 అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 9
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో  తెలంగాణ ఆస్తిత్వం కాపాడడం కోసం  ప్రజాస్వామిక శక్తులు  ఐక్యం కావాలనిప్రొఫెసర్ కోదండరాం ప్రజాయుద్ధం నౌక గద్దర్ లు  పిలుపునిచ్చారు.  మునుగోడు ఎన్నికల్లో కేఏ పాల్ ఆధ్వర్యంలోని  ప్రజాశాంతి పార్టీ తరఫున  ప్రజా యుద్ధ నౌక గద్దర్  పోటీ చేస్తారని ప్రతిపాదన రావడంతో  ఆదివారం అల్వాల్ వెంకటాపురం లోని  మహాబోధి విద్యాలయంలో  ప్రొఫెసర్ కోదండరాం  ఇతర ప్రజాసంఘాల నాయకులతో కలిసి గద్దర్ తో చర్చలు జరిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కోటి ఆశలతో అస్తిత్వం కాపాడుకోవడం కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి సాధిస్తే  దాని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం  వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం కోసం కలలుకని  పోరాటం సాగించాను అవి నెరవేరలేదని, అమరవీరుల త్యాగాలువృధా కాకుండా ఉండాలంటే ప్రజాస్వానికి శక్తుల ఐక్యత ఉమ్మడి పోరాటం అవసరమని  వారు అభిప్రాయపడ్డారు. 1978  జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి  కవి రచయిత కాళోజీ నారాయణరావు  ఎన్నికల్లో పోటీ చేసి  తన నిరసనను ప్రభుత్వానికి తెలియ చెప్పారని దానిని స్ఫూర్తిగా తీసుకొని  ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజా గాయకుడు, కవి రచయిత  గద్దర్ ఎన్నికల్లో  తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల్లో పోటీ చేయాలని  ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థించారు. తెలంగాణ కోసం పోరాడిన యోధులలో  గద్దర్ ఒకరిని  పార్లమెంటరీ  ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఆయన పోటీ చేస్తానన్న కారణంగా  ప్రజాశాంతి పార్టీతో కాకుండా  ప్రజాస్వామిక వాదుల  ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చర్చలు జరుపుతున్నామని  కోదండరాం స్పష్టం చేశారు.  దేశ ప్రజలందరూ తెలంగాణలోని మునుగోడు ఎన్నికల వైపు చూస్తుందని కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చానని  గద్దర్ స్పష్టం చేశారు.  ప్రజా సంఘటన ద్వారానే మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించామని   దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు.  తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధాకరమని  అమరవీరుల త్యాగాలు  వృధా పోతున్నాయని  ప్రజా సంఘాలుగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు జరిన ఉమ్మడి పోరాటాలతోటే ప్రజా చైతన్య వచ్చిందని  1978లో కాలోజీ నారాయణరావు  ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేశారని. ఆయన బాటలోనే ప్రస్తుతం  తాను పోటీ చేయడానికి  ప్రజా సంఘాల నుంచి అభ్యర్థులు వస్తున్నాయని  వీటన్నిటితో చర్చించిన తర్వాతే  ముందుకు వెళ్దామని  గద్దర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షులు  పి ఎల్ విశ్వేశ్వరరావు,  నాయకులు ధర్మ అర్జున్, అంబటి శ్రీనివాస్, బైరి రమేష్ బైరి రమేష్, బొజ్జ కనకయ్య, దయాకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు