మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ దే

భారీ మెజారిటీతో పట్టం కట్టనున్న ఓటర్లు

పలుమార్లు నిజమైన జనంసాక్షి సర్వేలు

జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని

భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 17 (జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని జోస్యం చెప్పారు. అందుకు ప్రముఖ తెలుగు దినపత్రిక జనంసాక్షి నిర్వహించిన సర్వేనే నిదర్శనమని ఆమే అన్నారు. తాజాగా రెండవసారి జనంసాక్షి సర్వేలో టిఆర్ఎస్ అభ్యర్థికి 49 శాతం ఓట్లతో గెలుపు బాటలో నడుస్తుండడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్ నాటికి టిఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కెసిఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు దోహదపడుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. విపక్ష కాంగ్రెస్, బిజెపి రెండవ స్థానం కోసం హోరాహోరీగా పోరాడక తప్పదని ఆమె అన్నారు. గతంలో జనంసాక్షి నిర్వహించిన అనేక సర్వేలు నిజమైన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం మునుగోడు ప్రజలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు

Attachments area