మునుగోడులో బీఎస్పీ పార్టీ గెలుపే లక్ష్యoగా 2 వ విడత రాజ్యాధికార యాత్ర ప్రచారంలోపాల్గొన్న డోర్నకల్ బిఎస్పీ పార్టీ శ్రేణులు.

బిఎస్పి జిల్లా అధ్యక్షులు యల్ విజయ్ కాంత్, ఉపాధ్యక్షులు తగరం నాగన్న.

కురవి సెప్టెంబర్-28
(జనం సాక్షి న్యూస్)

మునుగోడులో జరగబోయే ఉపఎన్నిక ఎలక్షన్లలో బీఎస్పీ పార్టీ గెలిచి తీరుతుందని నీలి జెండా ఎగిరేస్తామని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యల్ విజయ్ కాంత్, ఉపాధ్యక్షులు తగరం నాగన్న దిమా వ్యక్తం చేశారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పలు వాహనాలలో మునుగోడు నియోజకవర్గంకు తరలి వెళ్లారు.బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ విడత బహుజన యాత్రలో భాగంగా మునుగోడు ప్రచార నిమిత్తమై మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ ప్రచారంలో పాల్గొనుటకు వెళ్లడం జరిగింది.కాంగ్రెస్, బిజెపి,టిఆర్ఎస్ మోసపూరిత పార్టీలను నమ్మి మోసపోవద్దని అగ్రకుల పార్టీలను ఓడించి బిఎస్పి పార్టీని గెలిపించటానికి తద్వారా ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు అగ్రకుల పేదలకు విద్యా,వైద్యం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే బహుజన రాజ్యం రావాలి అని,అందుకె ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటు వేయవలసిందిగా వాళ్లు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబెర్ ఎడ్ల శ్రీను, డోర్నకల్ నియోజకవర్గం ఇంచార్జి తేజవత్ అభి, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు గుండె రాంనర్సయ్య,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి తగరం శ్రీరామ్,అసెంబ్లీ ట్రెసరర్ భాసిపంగు మహేందర్,మరిపెడ మండలం నాయకులు జినక క్రిష్ణ మూర్తి, దంత లపల్లి మండలం అధ్యక్షులు మిడతపల్లి వెంకన్న,ఈదురు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.