ఎల్బీ నగర్( జనం సాక్షి )మునుగోడు గడ్డపై రాజగోపాల్ రెడ్డి ని ఓడించే వ్యక్తి లేడని , భారతీయ జనతా పార్టీ విజయ పరంపరను ఎదిరించే శక్తి లేదు. మునుగోడు నియోజకవర్గం నిండా కాషాయ సైన్యం– ఊరూరా రాజన్నకు ప్రజల నిరాజనం అసమర్ధ టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి, జవసత్వాలు, కార్యకర్తలు లేని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పదు. అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని బిజెపి బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు పేరు పెళ్లి వెంకటరెడ్డి అన్నారు . మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నాంపల్లి మండల ఎన్నికల సహా ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కాషాయ దళం, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెరాస ప్రభుత్వం పై వ్యతిరేకత, అవినీతి, కుటుంబ పాలన నుండి విముక్తి కొరకు, ముఖ్యంగా స్థానిక టిఆర్ఎస్ నాయకుల ఆగడాలపై, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు . రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పూర్తి సమ్మతిని తెలియజేస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం దిశగా చేస్తున్నటువంటి పోరాటానికి ఆకర్షితులై గ్రామపంచాయతీ సభ్యుల నుండి మొదలుకొని, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉద్యమ నేతలు, మాజీ పార్లమెంటు సభ్యుల వరకు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు . అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని కుయుక్తులు పన్నిన, అవినీతి సొమ్మును ఎంత పంచినా, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో పెరుగుతున్న ఆదరణను, మునుగోడు ప్రజల హృదయాలలో రాజగోపాల్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని కొనలేరు అని ఓటర్లు అంటున్నారు. దుబ్బాకలో దుమ్మురేపిన జెండాను, హుజురాబాద్ లో హోరెత్తించిన జెండాను, మునుగోడు గడ్డపై రెపరెపలాడిస్తామని ప్రజలు కంకణ బద్ధులై పనిచేస్తున్నారని అన్నారు .
Attachments area




