మాజీ ఉప ముఖ్యమంత్రి
నాంపల్లి సెప్టెంబర్ 20( జనం సాక్షి)
మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని తెలంగాణ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలకులకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహయ్య మంగళవారం నాంపల్లి కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు బయట తిట్టుకుంటూ కాంగ్రెస్ను పార్టీ దెబ్బ కొట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను దెబ్బతీసిన కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక గుణపాఠం కావాలి అని అన్నారు.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలిపించడానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.అమలు కాని హామీలతో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్ కు ఈ ఉప ఎన్నికల్లో పరాభవం తప్పదని అన్నారు.బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని పేర్కొన్నారు.మోడీ కెసిఆర్ కు తగిన బుద్ధిని ఓటు ద్వారా చెబుతారని అన్నారు.మునుగోడు నియోజకవర్గంని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయటంలో విఫలమైందని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని తెలంగాణ అప్పుల మయం చేసిన కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని ఈ మునుగోడు ఉప ఎన్నిక బిజెపి,టిఆర్ఎస్ కు ఓటమి తప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి,సికింద్రాబాద్ మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,గాలి అనిల్ రెడ్డి,కొండేటి మల్లయ్య,సంజీవరెడ్డి,రాజిరెడ్డి, అంజయ్య,రవీందర్ రెడ్డి, హనుమంత చారి,కోన్ రెడ్డి వెంకటయ్య , మండల నాయకుడు కొమ్ము బిక్షం, కోరే కిషన్,జడ బిక్షం,పులకరం వెంకటేశ్వర్లు, గాదె పాక వేలాద్రి, ఎస్.కె చాంద్, బేగరి గిరి,గఫార్,బెల్లంకొండ నాగరాజు,ఆరోగ్య రెడ్డి,పిల్లి వెంకటయ్య,నాంపల్లి సంజీవ,సుధాకర్ రెడ్డి, ఎద్దుల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం




