*మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం- ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ*

*మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి గెలవాలని కొమరవెల్లి మల్లన్నకు పూజలు*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ ముదిరాజ్ అన్నారు.
మునుగోడు ఎన్నికల్లో బిజెపి గెలవాలని మరియు రాష్ట్రంలో బిజెపి అధికారం రావాలని కోరుతూ ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నాయకులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, సర్వేలు తెలుపడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయాలో పాలు పోగా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి దేశ రాజకీయాలంటూ రాష్ట్రాలు పట్టుకు తిరుగుతున్నాడు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చినవి ఒక్క ఆమిని కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరిగిందన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్,కృష్ణ, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గొరిగె రాజు,చంద్రపాల్ రెడ్డి, లింగం, యువ మోర్చా అధ్యక్షుడు సాయి యాదవ్, విజయ్,రావత్,రుకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : కొమురవెల్లి మల్లన్న కు పూజలు చేసిన బిజెపి నాయకులు.