మునుగోడు ఎన్నికల ప్రచారం పాల్గొన్న జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 16 (జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం లోని వావిల్ల పల్లి గ్రామం లో జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు కొనింట్టి మాణిక్ రావు, ఇంటికి తిరుగుతు ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో అధికారులు జహీరాబాద్ నుండి ప్రచారం కి వొచ్చిన టి.ఆర్.ఎస్ నాయకుల వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే విధంగా ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి అని ఎమ్మెల్యే మాణిక్ రావు ను కోరారు.ఈ ప్రచారం లో టీ.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బండి మోహన్, పిచరగడ్ సర్పంచ్ జే.రవి కిరణ్, జహీరాబాద్ టీ.అర్.ఎస్.వి ఇంచార్జీ రాకేష్, ఎస్. సి. సెల్ పట్టణ అద్యక్ష్యులు ఏర్రొల శివప్పా మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.