Friday, 6 November 2026

మునుగోడు నియోజకవర్గంలో సికింద్రాబాద్ బిజెపి నాయకులు ..

  సికింద్రాబాద్  (జనం సాక్షి )   సికింద్రాబాద్     మహంకాళి జిల్లా   బిజెపి  ప్రధాన కార్యదర్శి  మేకల సారంగాపాన్ని ఆధ్వర్యంలో       మునుగోడు  ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం సికింద్రాబాద్ నియోజకవర్గం లోని ముఖ్యమైన నాయకులను  మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్  సమావేశం లో పాల్గొన్నారు . ఈ సమావేశంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, కన్నాభిరామ్, దేవుడు కుమార్,ఈ ల్ ప్రతాప్ కుమార్, రాజ్ కుమార్ నేత, వనమాల శ్రీనివాస్,  నరసింహ, వీరేశం, నాని, హరీష్, శ్రీకాంత్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొని ప్రచార నిర్వహించారు .  ఈ సందర్భంగా మేకల సారంగపాణి మాట్లాడుతూ మునుగోడులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని,మునుగోడు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కమలం పువ్వు బిజెపికి ఓటు వేయాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలు సిద్ధించడానికి నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే బిజెపికే పట్టం కట్టాలని కోరడం జరిగింది అవినీతి కుటుంబ పాలనైన టిఆర్ఎస్కు మునుగోడులో బొంద పెట్టాలని  పిలుపును  ఇచ్చారు.   బిజెపి పార్టీ  ఎమ్మెల్యే   అభ్యర్థి    రాజగోపాల్ రెడ్డి భారీ  మెజారిటీ తో  గెలవడం ఖాయమని తెలిపారు .