ఎల్బీ నగర్ (జనం సాక్షి )మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్న నగర్ , హనుమాన్ నగర్ మున్సిపాలిటీలకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యే .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ని అధిష్టానం ఇంఛార్జిగా నియమించారు.ఈ మేరకు శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ రోజు స్థానిక నాయకులతో సమావేశం అయ్యారు.దానిలో భాగంగా చౌటుప్పల్ కు చెందిన పలువురు బి.సి.సంఘం సభ్యులు , ముస్లిం మైనారిటీ సభ్యులు తెరాస పార్టీలో చేరిక కావడం జరిగింది.వారికి సుధీర్ రెడ్డి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.వారు మాట్లాడుతూ
ఈ మునుగోడులో జరగబోయే ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఇ కార్యక్రమంలో చేరిక అయిన వారిలో విజయ,మహేష్,లక్మి నారాయణ,అజిజ్ తదితరులు ఉన్నారు. అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీ తెరాస నాయకులు
ఎల్.బి.నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు ఆందోజు సత్యం చారి , డివిజన్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మెరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి డివిజన్ తెరాస బీసీ సెల్ కార్యదర్శి భిక్షపతి చారీ , డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి , తెరాస డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు విజయ్‌కుమార్ ,శ్రీరాములు గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు .




