మునుగోడు ప్రచారానికి బయలుదేరిన టేకులపల్లి మండల బీఎస్పీ నాయకులు
టేకులపల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి): మునుగోడు ప్రచారానికి ఇల్లందు నియోజకవర్గ బి ఎస్ పి అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ ఆధ్వర్యంలో గ్యాస్, బియ్యం, వంట సామాగ్రితో టేకులపల్లి మండల బీఎస్పీ నాయకులు శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా మునుగోడులో సాగుతున్న ప్రచారానికి తమ వంతుగా ప్రచారంలో పాల్గొనాలని మండల నాయకులు తమ వంట సామాగ్రి తామే ఏర్పాటు చేసుకొని, ఎవరి సద్ది వారిదే, హంగులు ఆర్భాటాలతో కాకుండా తమ స్వతహాగా తమ వంటలకి సంబంధించిన సరుకులను తామే సర్దుకొని బయలుదేరారని అన్నారు. 75 సంవత్సరాలలో ఒక బీసీ బిడ్డకు సీటు కేటాయించలేదు చరిత్రలో ఇది మరపురాని ఘట్టం. ఈ అవకాశాన్ని బహుజన బిడ్డలందరూ సద్వినియోగం చేసుకొని మన ప్రియతమ బీసీ బిడ్డను గెలిపించుకోవాలని కోరారు. అధికార పక్షం, కమ్యూనిస్టులు, ప్రతిపక్షాల సైతం దొరలకే టికెట్ ఇచ్చారు, తప్ప బహుజనులకు ఇవ్వలేదు అంటే అర్థమవుతుందనీ, వీళ్లు ఎవరి కోసం,ఎవరి ఉపయోగాలు కోసం పని చేస్తారనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని,బహుజనులారా ఇకనైనా మేల్కోండి మన రాజ్యాధికారాన్ని మనమే తెచ్చుకుందాము మన బిడ్డని మనం గెలిపించుకుందాం అన్నారు. తమసద్ది తామే కట్టుకొని, ఒకరి మీద ఆధారపడకుండా, మాకు కావాల్సిన సామాగ్రిని మేమే ఏర్పాటు చేసుకొని వెళ్తున్నామన్నారు. తమ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకుంటామన్నారు. బహుజన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా, ఉన్నతమైన ప్రమాణాలతో జీవనం సాగిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ మండల నాయకులు రాంబాబు, హచ్చు,తులసమ్మ,రాంబాయి, లలిత, రాజు, లక్ష్మి, పద్మ, జమున తదితరులు పాల్గొన్నారు.