Thursday, 5 November 2026

మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన టీఆరెస్ బృందం..

హైదరాబాద్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో కలిసి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన టీఆరెస్ బృందం..

18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బిజెపి లో చేరానని ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని
రాజగోపాల్ రెడ్డి ని ఆన్ క్వాలిఫై చేయాలని జనరల్ సెక్రెటరీ లు శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎన్నికల ప్రధాన అధికారి కి రిప్రజెంటేషన్ ఇచ్చారు..

బడుగుల లింగయ్య యాదవ్,ఎంపీ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బిజెపి పార్టీ నుండి 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టివి చానల్ లో స్వయంగా చెప్పారు..

ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య…

రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గాలికి వదిలేశారు…

ఇచ్చిపుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము..

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా ఆన్ క్వాలిఫై చేయాలని ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము..

కాంట్రాక్ట్ లో వచ్చిన డబ్బులతో మునుగొడులో ప్రజాస్వమ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు…

 

గాదరి కిషోర్ ఎమ్మెల్యే
రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరడానికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చరని స్వయంగా చెప్పాడు ..

రాజగోపాల్ రెడ్డి ని అనర్హుడి గా ప్రకటించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము..

ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు అపహాస్యం చేస్తున్నాడు…

ఇలాంటి వారిని ప్రోత్సాహించద్దు అని ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము..

ఈటెల రాజేందర్ కి వివేక్ కి కూడా వాటా ఇస్తామని చెప్పాడట.

రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాణ్ణి మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు…

ఇలాంటి లంగని ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారు.

ప్రజల కోసం ఏనాడు పని చేయలేదు పైసల అహంకారం ఉంది..

ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బిజెపి వాళ్ళు కృత్తిమ ఎన్నిక తెచ్చారు…

రాజగోపాల్ రెడ్టి బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..
ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారు.

మునుగొడులో ఎగిరెది గులాబీ జెండానే…