Monday, 2 November 2026

మున్నూరు కాపులు ఐక్యతతో ముందుకు సాగాలి

*

 

 

మున్నూరుకాపు నాయకులు లక్కినేని సురేందర్రావు

టేకులపల్లి, జనవరి 31( జనం సాక్షి): టేకులపల్లి మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు లక్కినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం మున్నూరు కాపు సమావేశం టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో బేతంపూడి సొసైటీ అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘ నాయకులు లక్కినేని సురేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన కులంలో అత్యధికంగా ఉన్నది మున్నూరు కాపులేనని , అలాగే ఇల్లెందు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఇల్లందు పట్టణం తో కలిపి మున్నూరు కాపులు 25 నుంచి 30 వేల మధ్యలో ఉన్నారని,వారి ఐక్యతకు, వారి సంక్షేమానికి సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తుందని, ప్రతి కాపు కుటుంబానికి అండగా నిలుస్తుందని అన్నారు. మున్నూరు కాపులు ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు లక్కినేని వెంకటేశ్వరరావు, మున్నూరు కాపు సంఘ గౌరవ సభ్యులు నర్సింగ్ లక్ష్మయ్య, గంగారపు కోటేశ్వరరావు, దోర్నాల విజయ మోహన్ రావు, గంగారపు రమేష్, యాస ప్రసాద్, కడుదుల వీరన్న, నారం దాస్ నరసింహారావు, లక్కినేని మురళి, నర్సింగ్ శ్రీనివాసరావు, బండ్ల కృష్ణ, లక్కినేని కృష్ణ , గంగారపు శేషయ్య, కడుదుల రాము తదితరులు పాల్గొన్నారు.