మున్నూరు కాపు రాష్ట్ర జర్నలిస్టుల ప్లీనరీనికి తరలిరావాలని పిలుపు నిచ్చిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి

జనం సాక్షి: నర్సంపేట
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టుల మొదటి ప్లీనరీ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహిస్తున్నమని మున్నూరు కాపు రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ప్రధానకార్యదర్శి కొప్పుల బుచ్చి రాములు తెలిపారు.
ఇప్పటికె మన కులము నుండి ఉన్న పలు పార్టీల రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేశాము.  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బాజాప రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్,రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర,ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,  ఎమ్మెల్సీ దండే విట్టల్, కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య,  మున్నూరు కాపు ముద్దుబిడ్డ రాజకీయ కురువృద్ధుడు  హనుమంతరావు, మహిళా కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత లతోపాటు రాష్ట్రంలోని వివిధ హోదాలో ఉన్న రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేయడం అందజేశాం.సెప్టెంబర్ 4 న నిర్వహించనున్న ఫ్లినరికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం కార్యవర్గంతో పాటు జర్నలిస్టు సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఫ్లినరి విజయవంతం చేయాలని కోరారు.