*మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో పలు ప్లాస్టిక్ దుకాణాలలో దాడులు నిర్వహించిన మున్సిపల్ అధికారులు*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 08,
జనంసాక్షి
మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ఆదేశాలతో పలు షాపుల పై దాడులు నిర్వహించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్స్ , ప్లాస్టిక్ గ్లాసులు ,ప్లాస్టిక్ ప్లేట్లు స్వాధీనం చేసుకొని 5000 వేల రూ జరిమానా విధించడం అయినది . కమిషనర్ సల్వాది సమ్మయ్య మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ గాని ప్లేట్లు గాని గ్లాసులు గాని వాడినచో 5 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధించబడునని ఈ సందర్భంగా తెలిపినారు జ్యూట్ బ్యాగులు వాడాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు , ముజీబ్ ధర్మేందర్ ,పున్నం నాయక్ , మహేష్ , తదితరులు పాల్గొన్నారు