హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రమదానం!

రహదారిపై గుంతలు పూడ్చిన సభ్యులు

జనం సాక్షి,చెన్నారావుపేట

చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్ధుంపురం బస్టాండ్ సెంటర్ ఏరియాలో ప్రమాదకరంగా మారిన గుంతలను హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రమదానం చేసి పూడ్చి వేశారు. నర్సంపేట- నెక్కొండ ప్రధాన రహదారి లో ప్రయాణించే వాహన చోదకులు ఇబ్బందులు పడుతుండటం, ప్రమాదాలు జరుగుతుండటంతో… రోడ్డు గుంతల్లో సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని వేసి పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు వేములపల్లి రాజు, ప్రచార కార్యదర్శి ననుమాస కర్ణాకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుండె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తూటి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సంకటి రాజేంద్రప్రసాద్, అల్లాడి భాస్కర్, కార్యదర్శి దొంతి సంతోష్, గ్రామస్తులు ముత్యాల కుమార్, నాగపురి రాజు, గొడిశాల మల్లయ్య, వేములపల్లి కుమారస్వామి, నాంపల్లి కుమార్, కొయ్యల భాస్కర్, నాంపల్లి మల్లయ్య, నజీర్, గౌస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు వేములపల్లి రాజు మాట్లాడుతూ… నర్సంపేట, కాకతీయ నగర్, ముగ్దుంపురం, పాత ముగ్దుంపురం, చెన్నారావుపేట, జల్లి, అమీనాబాద్ ప్రాంతాల ప్రయాణికులు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, పాత ముగ్దుంపురం నుండి పాపయ్యపేట క్రాస్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు చేసి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.