మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం

మోత్కూరు జూలై 31 జనంసాక్షి : పురపాలక సంఘ కార్యాలయములో మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పురపాలక సంఘ పరిధిలో గతములో పశువుల హాస్పిటల్ ను హెల్త్ సబ్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ నిమిత్తం మరొక ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేయాలని అదే విధముగా సెంట్రల్ లైటింగ్ లైట్ లకు నూతన మీటర్లు ఏర్పాటు చేయుటకు తీర్మానించారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోనవలసినదిగా, స్ట్రీట్ లైట్స్ పని చేయడం లేదని దానికి తగు చర్యలు తీసుకోనవలసినదిగా చర్చించనైనది. కొండగడప, బుజిలాపురం లలో మంజూరైన స్మశానవాటిక పనులు చేయుటకు కాంట్రాక్టర్ లు రాకపోవడం వలన ఇట్టి స్మశాన వాటికలు పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోనవలసినదిగా చర్చించనైనది. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమీషనర్ సి.శ్రీకాంత్, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, అన్ని వార్డుల కౌన్సిలర్లు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, వనం స్వామి, కురెళ్ళ కుమార్,గుర్రం కవిత, కో ఆప్షన్ సభ్యులు గణగాని నర్సింహా తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు