ఉగ్గేల్లి రాములు పై వేటు
బి ఆర్ ఎస్ పార్టీ నుంచి ఎం జి రాములు ( హుగ్గేల్లి ) సస్పెండ్
బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 31 ::బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు ఎం జి రాములు (హుగ్గేల్లి) బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకో ఇవ్వడం జరిగిందని బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్ తెలిపారు.తన సొంత ప్రయోజనాల కోసం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించారని వివరించారు.ఉగ్గేల్లి రాములు తన స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికుల సంక్షేమాన్ని పణంగా పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకోబడింది.కార్మిక వ్యతిరేక విధానాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించినందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.