Friday, 6 November 2026

ముప్కాల్ మండలం నాగంపేట్ లో కంటి వెలుగు ప్రారంభం

ముప్కాల్ మార్చ్ 17 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో ఒకటి ‘కంటి వెలుగు’ కార్యక్రమం. ఈ సందర్భంగా గురువారం రోజు ఉదయం మండలంలోని నాగంపేట్ గ్రామంలో గ్రామస్తులకు అందుబాటులో కంటి వెలుగు కార్యక్రమంను స్థానిక సర్పంచ్ కాశిరెడ్డి రాజవ్వ తో కలిసి ఎంపీపీ సామ పద్మవెంకట్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.డాక్టర్ ప్రణవ రోగులకు వైద్య సేవలను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ వెంకట్ రెడ్డి, సర్పంచ్ కాశిరెడ్డి రాజవ్వ, వైస్ ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, ఎంపీటీసీ సభ్యులు మేడిపల్లి మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి గంగాధర్, పంచాయతీ సెక్రటరీ గౌతమి, డాక్టర్ ప్రణవ, హెల్త్ సూపర్ వైజర్ భీమన్న, మేరమ్మ, ఆరోగ్య శాఖ సిబ్బంది, వార్డ్ సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్ వాడి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు