శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో ఆర్ అండ్ బి రోడ్ మీద ఏరులై పారుతున్న మురికి కాలువతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచ నీయమని తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం దేవర యంజాల్ లో రోడ్ల గుంతలు, మురికి కాలువలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపాలిటీ అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదన్నారు.
అదేవిధంగా మహాలక్ష్మి వెంచర్ ముందు ఉన్న మురికి కాలువ వర్షాలు పడినప్పుడల్లా మురికి కాలువ దగ్గర్లో ఉన్న ఇండ్లలోకి మురికి నీళ్లు భారీగా వచ్చి చేరి ఇండ్లలోని ప్రజలు బయటకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి మురికి కాలువకు శాశ్వత పరిష్కారం చేయ్యాలని తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.జైపాల్ రెడ్డి మరియు తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
తుంకుంట నుండి వయ దేవరయాంజాల్ మీదిగా కొంపల్లి వరకు వెళ్ళే థార్ రోడ్ దేవరయాంజాల్ వద్ద పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు వాహనదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది,ఇప్పటికైనా ఆర్ & బి అధికారులు స్పందించి రోడ్ బాగు చేయ్యాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేశారు.
15ఎస్పీటీ -1: మురికి పారుతున్న దృశ్యం
15ఎస్పీటీ -2: గుంతలతో థార్ రోడ్డు
మురికి ఏరులై పారుతున్న పట్టించుకోరా :జైపాల్ రెడ్డి




