మురుగు నీటి కాల్వలో మృత శిశువు…

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేటలో అత్యంత అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని మురుగునీటి కాలువలో అప్పుడే పుట్టి చనిపోయిన మృత మగ శిశువును చూసి గ్రామస్తులు చలించిపోయారు. ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో చిమ్మచీకటిగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రామగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు