Wednesday, 4 November 2026

ములాయం మరణం తీరని లోటు రాష్ట్రమంత్రి: కొప్పుల ఈశ్వర్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,తీవ్ర దిగ్భ్రంతిని వ్యక్తం చేశారు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఒక సారి కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం బడుగు..బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని సంతాప ప్రకటనలో తెలియజేశారు.ములాయం మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు,ములాయం కుటుంబసభ్యులకు ప్రగడ సానుభూతి వ్యక్తం చేశారు.