కలెక్టర్ కార్యాలయం ముందు
శివ సతులకు వినతి పత్రాన్ని సమర్పించిన ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్….
ములుగు,ఫిబ్రవరి16(జనం సాక్షి):-
ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శివసత్తుల ములుగు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శివ సతులకు వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం ముందు సమర్పించిన ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ అనంతరం ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ ములుగు జిల్లా సమ్మక్క సారక్క నామకరణం చేయడం లో విఫలం అవుతున్నందున దానికి నిరసనగా శివ సతులకు ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం ఏర్పాటు చేయడం కోసం తమ వంతు కృషి చేయాలని శివ సతులకు ముంజల భిక్షపతి గౌడ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు శివసత్తుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం శివసత్తుల సంఘం పట్టణ అధ్యక్షులు ఎనగందుల మొగిలి మాట్లాడుతూ మేము సమ్మక్క సారక్క దేవతల పేర్లు పెట్టాలని సమ్మక్క సారక్క సన్నిధిలో పూజలు నిర్వహిస్తున్నామని ఎలగందుల మొగిలి అన్నారు కెసిఆర్ 18వ తేదీన సమ్మక్క సారక్క జాతర కు కుటుంబ సమేతంగా వస్తున్న సందర్భంగా సమ్మక్క సారక్క సన్నిధిలోని సమ్మక్క సారక్క సాక్షిగా వన దేవతల పేర్లు ములుగు జిల్లా కు పెట్టాలని శివసత్తుల సంఘం పట్టణ అధ్యక్షులు ఎనగందుల మొగిలి డిమాండ్ చేశారు.కాసిందేవిపేట సర్పంచ్ ఎండి.అహ్మద్ భాష మాట్లాడుతూ ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేస్తానని కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రం కూడా సమ్మక్క సారక్క దయవలన ఏర్పడిందని కాసింది పేట సర్పంచ్ ఎండి అహ్మద్ భాష అన్నారు ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గారు మాట్లాడుతూ ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 17 వ తేదీన 18న 19న ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు దీక్షలు నిర్వహిస్తున్నామని ముంజల బిక్షపతి తెలిపారు కెసిఆర్ ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన ములుగు జిల్లా కు ఎందుకు పెట్టడం లేదని ఆయన విమర్శించారు ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టమని అక్కడ ఎవరు ఉద్యమాలు పోరాటాలు చేయలేదు ఎవరికోసం ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టినాడు హిందూ బ్రాహ్మణీయ దేవతలు కాబట్టి ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టారు గద్వాల్ కు జోగులాంబ అని భువనగిరికి కెసిఆర్ కు నచ్చే దేవుడు కాబట్టి యాదాద్రి అని కొడుకు కేటీఆర్ కు నచ్చిన దేవుడు వేములవాడ రాజన్న కాబట్టి సిరిసిల్ల కు వేములవాడ రాజన్న అని కొత్తగూడెం భద్రాద్రి అని ఈ విధంగా దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లా కు వనదేవతల పేరు ఎందుకు పెట్టలేదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మహా కుంభమేళా జాతర గా పేరుగాంచింది కెసిఆర్ బర్త్ డే 15వ తేదీ నుండి 17 వరకు జరుగుతూ నా సందర్భంగా 18వ తేదీన మేడారం జాతరకు కుటుంబ సమేతంగా వస్తున్నారు కాబట్టి మన దేవతల సాక్షిగా ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం కెసిఆర్ గారు ములుగు జిల్లా చేసినారు కానీ సమ్మక-సారక్క నామకరణం ఎందుకు చేయలేదు అని బిక్షపతి విమర్శించారు ఇప్పటికైనా ములుగు జిల్లా సమ్మక్క సారక్క నామకరణం చేయాలని 18 వ తేదీన ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు 17 మరియు 18 మరియు 19వ తేదీ వరకు దీక్షలు కొనసాగుతాయని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ తెలిపారు ఈ శివసత్తుల నిరసన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం ముందు జరుగగా వారికి మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఇనుముల నారాయణ ప్రజా సంఘాల జిల్లా కమిటీ సభ్యుడు శివసత్తుల సంఘం ములుగు పట్టణ కమిటీ నాయకులు చంద్రగిరి కర్ణాకర్ బాబు నరసయ్య తూర రమేష్ గేదెల శ్రీనివాస్ పోలంపల్లి వినోదు గోనెల యాకయ్య జక్కుల సతీష్ ములుగు పట్టణ శివసత్తుల వీరి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వీరికి మద్దతుగా పాల్గొన్న నాయకులు ప్రజా సంఘాల నాయకులు జేరిపోతుల పైడి సామర్ల గణేష్ ఎరుకల హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా నాయకులు శ్యామ్ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కొలిపాక ప్రశాంత్ సారయ్య రమేష్ మనోహర్ రవి తిరుపతి తదితరులు మద్దతుగా పాల్గొన్నారు.




