ములుగు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల సందర్శన.

భూక్య దేవ్ సింగ్ మున్సిపల్ కమిషనర్ (VRS)

ములుగు జిల్లా

గోవిందరావుపేట జులై  16  (జనం సాక్షి):-
నియోజకవర్గంలో భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ఏజెన్సీ ప్రాంతాలలో ఈరోజు భూక్య దేవ్ సింగ్ పర్యటనలు చేశారు.  ఈ సందర్భంగా ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు గ్రామానికి మార్గమధ్యలో అతి భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా కొట్టుకపోవడంతో ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు.ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ కన్నాయి గూడెం మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రజలకు పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుపుతూ వారికి సంబంధిత అధికారులు వెంటనే మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరారు.అలాగే పునరావాసాలకు తరలించబడిన ప్రజలకు వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్కడి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు జిల్లా కలెక్టర్ తో పాటు ఆయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్థానిక అటవీశాఖ అధికారులు మరియు సామాజికవేత్త దొంతి విజేందర్ రెడ్డి,కుమార్ పాడ్య,సేవాలాల్ రాష్ట్ర నాయకులు పోరిక రాహుల్ నాయక్,బాదావత్ రాజ్ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.