మూడున జరిగే చలో హైదరాబాదు విజయవంతం చేయండి
కార్మికుల హక్కుల సాధన కోసం ఆగస్టు 3న చేపట్టే చలో హైదరాబాద్ ని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ కోరారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయా ట్రేడ్ యూనియన్ల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిరుపతి రామ్మూర్తి, గుణగంటి రాంచంద్రు, పాపి రెడ్డి, వెంకన్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు