] *తెరాస (బిఆర్ఎస్)పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కు అందని సిఎంఆర్ఎఫ్…
[ ] *2019లొ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అందజేత…
[ ] సీఎంఆర్ఎఫ్ ఫైల్ నెంబర్ 84853…
[ ] *గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బాధితుడు…
[ ] *పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన లాభం లేదంటున్న బాధితుడు…
[ ] చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- తెరాస (బిఆర్ఎస్) పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలప్ చేడ్ మండలం అజ్జమర్రి గ్రామానికి చెందిన బేగరి బాల్ రాజ్ తెరాస (బిఆర్ఎస్) కార్యకర్త మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేయడం జరిగింది ప్రమాదవశత్తు 2019లో తన కూతురుకు బ్రెయిన్ వాపుతో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది తన కూతురును ఎలాగైనా కాపాడుకోవాలని ఉద్దేశంతో హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ లో చికిత్స చేయించగా సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేయగా వారి పాప శ్రీ వర్షిక కు ఎటువంటి ఫలితం లభించలేదు అయినా డబ్బులకు లెక్క చేయకుండా పాప ప్రాణాలే లక్ష్యంగా పెట్టుకొని డబ్బు ఖర్చు చేయగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు లేక పాపకు బ్రెయిన్ వాపుతో బ్రెయిన్ డ్యామేజ్ అయిందని డాక్టర్లు తెలియజేయగా చేసేదేమీ లేక వారు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ చేయించుకుని స్వగ్రామానికి తీసుకెళ్లారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ హాస్పిటల్ బిల్స్ తో 2019 నవంబర్ నెలలో సీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించి తమకు తగిన సహాయం చేస్తామని వారి పిఏ కు ఫైల్ తీసుకోవాలని సూచించగా వారు హాస్పిటల్ బిల్స్ గురించి చెక్ చేయగా ఫార్మసి ఫోను మిగతా 5 లక్షల ఏడు వేల రూపాయలకు హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేసుకోవడం జరిగింది 2019 నుండి ఇప్పటివరకు అనగా 2023 వరకు వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని అప్పటి నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కనీసం ఎనిమిది సార్లు కలిసి మా పాపకు సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫైల్ నెంబర్ 84853 ఇప్పటివరకు రాలేదని పలుమార్లు విన్నవించిన సరే చూస్తాములే అనుకుంటూ సమాధానం చెప్పుతున్నారు ఇప్పటివరకు కూడా అదే సమాధానం చెబుతున్నారు గ్రామంలో పలుమార్లు సర్పంచ్ పరశురాం రెడ్డి తో గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి సర్పంచ్ నీతో సహ అందరికీ సీఎంఆర్ఎఫ్ వస్తుంది కానీ నాకు ఇంతవరకు రాలేదని బాధితుడు పలుమార్లు తెలియజేయగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము కదా వారు పర్సనల్గా తీసుకొని చేస్తానని మాట ఇచ్చారు త్వరలోనే ఆర్థిక మంత్రి సీఎం గారితో కలవబోతున్నారు వారికి నీ ఫైల్ గురించి తెలియజేసి త్వరగా అయ్యేవిధంగా చూస్తానని నీ( బాధితుడి) ముందే చేపినాడు నేను కూడా పర్సనల్ గా గుర్తు చేస్తున్న అని సర్పంచ్ అంటున్నారు బాధితుడు2022లొ ఒకరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (సీఎంఆర్ఎఫ్) ఫైలును చూసి చేతిలోకి తీసుకొని నాకు ఎట్లాగూ సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇప్పియరు రాదు అని ఫైలును ఇంటికి తీసుకు వస్తాను అని తీసుకోగా గ్రామానికి చెందిన సర్పంచ్ పర్శరాం రెడ్డి ఎంపిటిసి మల్లయ్య అలాగే గ్రామస్తులు కొందరు కలగజేసుకుని సర్పంచ్ హామీ ఇస్తున్నారు వారు పర్సనల్గా తీసుకొని ఎమ్మెల్యేతో మాట్లాడి ఆర్థికమంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి నీకు సంబంధించిన ఫైల్ త్వరగా అయ్యే విధంగా చూస్తామని మాట ఇస్తున్నారు కదా ఒకసారి చూడండి అని బాధితుడితో సదరు గ్రామస్తులు తెలియజేయగా చేసేదేమీ లేక వారి మాటలు అంగీకరించి తిరిగి ఫైల్ అక్కడే ఇవ్వడం జరిగింది ఫైల్ ఇచ్చిన తర్వాత కూడా మరొక రెండు మూడు సార్లు ఎమ్మెల్యే దృష్టికి ఫైల్ గురించి తెలియజేయగా వారు త్వరలోనే ఇప్పిస్తామని చెప్తూ వస్తున్నారు. అయినా బాధితుడికి ఇప్పటికీ ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయం అందలేదని గుర్తు చేశారు సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇవ్వకున్నా సరే మా ఫైల్ మాకు ఇప్పించండి అని పలుమార్లు గ్రామ సర్పంచ్ కి తెలియజేసిన సరైన సమాధానం ఇవ్వడం లేదు ఫైల్ గురించి అడిగిన తెలుసుకుంటా అంటూ లేకపోతే కలిసి పోదాం సార్ తో మాట్లాడి తెలుసుకుందామంటూ రోజులు కాదు నెల్లలు కాదు సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా మా ఫైల్ గురించి పట్టించుకునే నాధులే లేరు అని బాధితుడు తెలియజేశారు




