మృతుడు సిద్దయ్య కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ ఆర్థిక సహకారం
ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 13 (జనంసాక్షి) ఆత్మకూరు కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన మార్గం సిద్దయ్య అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుడి భౌతిక దేహానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య గారి సహకారంతో 5000 రూపాయలను వారి కుటుంబసభ్యులకు అందచేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జన్నాయికోడే నగేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేశం వార్డు మెంబర్ లు లోడి నాగమణి బొబ్బల అంజి రెడ్డి పాక్స్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి నాయకులు స్థానికులు పాశం వినోద నాగం లక్ష్మా రెడ్డి పంజాల నర్సయ్య సార్ ఎద్దు వెంకటేశ్వర్లు దొంతరబోయిన భాస్కర్ ఎలగందుల శ్రీను పైల్ల బుచ్చి రెడ్డి చెరుకు రాములు లోడి మహేష్ రాచమల్ల రవి కోల మనోజ్ తదితరులు పాల్గొన్నారు