మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాందినగర్ కాలనికి చెందిన మెంట యాదగిరి ఆకాల మరణానికి చింతిస్తూ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ గుర్రం లక్షినర్సింహ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, మృతుని కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపల్దాస్ బిక్షం,మెంట యాదగిరి,పల్లె బిక్షం,బందెల రవి, కూరెళ్ళ నర్సింహ,మెంట నర్సింహ,యెళ్లంకి రవి తదితరులు పాల్గొన్నారు.