పెన్షన్లు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలో ధర్నా..

 బేల, అక్టోబర్ 17 ( జనం సాక్షి )  పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19 న బుధవారం   బేల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నాకు పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారందరూ  ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు..