మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

శంకరపట్నం, జనం సాక్షి న్యూస్,
ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి 5000.రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్ ఎఫ్ సి ఎల్ యూనియన్ నాయకులు అందజేశారు. మంగళవారం అంబాలపూర్ గ్రామంలో హరీష్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి యూనియన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించార.ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుల పక్షాన, ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకుపోరాటం చేస్తామని ఆర్ ఎఫ్ సి ఎల్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి రాము,కొమ్ము రాకేష్, నల్గొండ సతీష్, మార్కెటి రవీందర్, నాతేట్లల సుధాకర్,మెరుగు రవి,ఉదయ్, రాజు, ఉదయ్,కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.