మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన. బిజెపి రాష్ట్ర నాయకుడు . ముక్కెర

బచ్చన్నపేట సెప్టెంబర్ 11 (జనం సాక్షి) జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన జీడి వెంకటేష్ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందగా. వారి కుటుంబాన్ని ఆదివారం. సామాజిక కార్యకర్త బిజెపి రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం అందించి పరామర్శించారు. వెంకటేష్ పిల్లల చదువులకు ఎలాంటి సహాయం అయినా అందిస్తానని. పార్టీ నుంచి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. బిజెపి నాయకులు . ముక్కెర యువసేన. కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు