మృతుని కుటుంబానికి కౌన్సిలర్ సతీష్ ఆర్థిక సహాయం..
చేర్యాల (జనంసాక్షి) జులై 16 : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డుకు చెందిన ఎర్రోళ్ల మల్లేశం కుమారుడు కార్తీక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయిన విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్ శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబానికి అండగా నిలిచి నేనున్నానని 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, శ్రీనివాస్, పరశురాములు, బాచి తదితరులు పాల్గొన్నారు.