మృతుని కుటుంబానికి పరామర్శ
– ఆర్థిక సహాయం అందజేత
– ఎమ్మెల్యే రెడ్యా నాయక్
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 26 (జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా నర్సింహలపేట మండల పరిధి రూపుల తండ శివారు మధు తండాకు చెందిన గుగులోతు బొజ్జ (57) అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.పార్టీ అండగా ఉంటుందని మృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట సర్పంచ్ గుగులోతు లక్ష్మీ, లక్ష్మణ్,ఉపసర్పంచ్ జాటోత్ నాగేష్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.