మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ సెప్టెంబర్30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామ ఎస్టి కాలనీకి చెందిన కారం రామారావు సతీమణి యశోద రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్దేవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుర్సం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోడియం నరేందర్, రమేష్, కొట్టే శీను, వెంకట నరసయ్య, వీరబాబు, రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.