మృతుల కుటుంబాలకు చేయూత..

కేసముద్రం ఆగస్టు 26 జనం సాక్షి / శుక్రవారం  మండలంలోని అర్పనపల్లి గ్రామంలో మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆర్థిక సహాయం అందించి చేయూతనిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా మృతులు వేల్పుగొండ లలిత కుటుంబానికి ఒక క్వింటా బియ్యం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం,గంధం కొమరయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యం పార్టీ శ్రేణులు అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ నజీర్ అహ్మద్,కమటం శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గంధసిరి స్వరూప సోమయ్య, నీలం దుర్గేష్,  మండల ప్రచార కార్యదర్శి మోడం రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్ కే జానీ ,సట్ల శ్రీనివాస్,ఆటో జానీ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.