రాజీవ్ రహదారి కోసం చేసిన ఆందోళన ఏమయ్యింది
ప్రభుత్వంలోకి వచ్చినా పట్టించుకోని నేతలు
హైదరాబాద్,మే30(జనం సాక్షి): తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాలు కలచి వేస్తున్నాయి. జాగ్రత్తగా ఉన్నా,ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతున్నది. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు పెద్ద ప్రమాదాల్లో కనీసం 20మంది మృత్యువాత పడ్డారు. అనేకులు క్షతగాత్రుల య్యారు. ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. శనివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సవిూపంలో ఒక ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సం 12మంది ప్రాణాలు బలితీసుకుంది. మరో ఇరవైమంది తీవ్ర గాయాలపాలైనారు. రాజీవ్ రహదారిపై జరిగిన ఈ ఘటన నుంచి తేరుకోకముందే, మంగళవారం కరీంనగర్ జిల్లాలో చెంజర్ల వద్ద జరిగిన ప్రమాదంలో మరో ఏడుగురు బలయ్యారు. ఇది కూడా స్పీడ్‌తో కూడుకున్న ఓవర్ టేక్ కారణంగా జరిగిన ప్రమాదంగానే గుర్తించారు. లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు, పదిహేనుమంది గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకూ అతివేగం తోడయ్యింది. రాజీవ్ రహదారి వంకలు సరిచేయాలన్న ప్రతిపాదన ఎందుకనో మరుగున పడింది. దీంతో ఈ రోడ్డులో రోజూ ఒక ప్రమాదం నిత్యకృత్యంగా మారింది. ప్రజ్ఞాపూర్ ప్రమాద ఘటనలో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న ఓ జర్నలిస్ట్ కుటుంబం ఎలాంటి ప్రమేయం లేకుండానే ప్రాణాలు పోగొట్టుకుంది. ఇది ఎదుటి వాడి తప్పిదం కారణంగా జరిగిన ప్రమాదం. వారు తమ వాహనంలో రోడ్డుకు ఇటుగా భద్రంగా పోతున్నారు. డివైడర్‌కు అటుగా వేగంగా పోతున్న ఓ లారీని మరింత వేగంగా వెడుతున్న ఆర్టీసీ బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. బస్సు ఢీకొన్నందున లారీ అదుపు తప్పి డివైడర్‌విూదకు ఎక్కి రోడ్డుకు ఇటుగా వచ్చి ఒక కంటైనర్ వాహనాన్నీ, క్వాలిస్‌ను ఢీ కొన్నది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనలో బస్సు ప్రయాణికుల్లో నలుగురు, క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి చెందిన 8మందీ మృత్యువాత పడ్డారు. సాధారణంగా ఎక్స్‌ప్రెస్, లగ్జరీ వంటి బస్సులకు స్పీడ్‌లాక్ ఉంటుంది. కానీ, బస్సు డ్రైవర్ అతి వేగంతో పోయిన కారణంగానే లారీని వెనుకనుంచి ఢీకొట్టి, వెనువెంటనే ఒక్కసారిగా బస్సును పక్కకు తిప్పడంతో అది బోల్తాకొట్టినట్లు చెబుతున్నారు. అతివేగంతో ఓవర్ టేక్ చేసే క్రమంలోనే రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇది పూర్తిగా మానవ తప్పిదమే కానీ మరోటి కాదు. రాజీవ్ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలన్నింటికీ అదొక్కటే కారణం కాదు. 218 కిలోవిూటర్ల రాజీవ్ రహదారివిూద 2017లో 720 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 251మంది మరణించారు. ప్రతి ప్రమాదాన్నీ మానవ తప్పిదమని తీసిపారేయడం ద్వారా అధికారులు తమ బాధ్యతనుంచి తప్పించుకోవడం సరికాదు. /ూజీవ్‌రహదారిపై సాగుతున్న రక్తపాతానికి వాహనాల అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఒక కారణం. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లూ జరగాలి. దీనికితోడు గతంలో రహదారి వంకరలపై ఆందోళన చేసిన నేతలు ఇవాళ అధికారంలో ఉన్నా దీనిని పట్టించుకోవడం లేదు. వాహనాల సంఖ్య అనేకరెట్లు పెరిగిపోయి, సొంత వాహనాల్లో ప్రయాణించేవారు అధికమైపోయిన దశలో రోడ్లను విస్తరించి, నిర్వహణను పక్కాగా చేపడితే ప్రజల ప్రాణాలకు రోణ ఉంటుంది. లక్షలకోట్లు పెట్టి నిర్మించిన రహదారులపై ప్రమాదాలు జర్క్కుండా తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఎక్కడికక్కడ టోల్‌గేట్లు పెట్టి భారీగా సొమ్ము వసూలు చేస్తున్న సంస్థలు రోడ్ల నిర్వహణను మరచిపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా భావించాలి. రహదారుల నిర్మాణం ఇష్టం వచ్చినట్టుగా జరిపి, ఆ తరువాత ప్రయాణికుల భద్రత ఏర్పాట్ల గురించి ఆలోచించక పోవడడం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతన్నాయి. అందుకు రాజీవ్ రహదారని సజీవ సాక్ష్యం.




